Home > తెలంగాణ > Deepfake:‘స్కాంగ్రెస్’ నుంచి డీప్ ఫేక్ వీడియోలు.. అలర్ట్‌గా ఉండండి

Deepfake:‘స్కాంగ్రెస్’ నుంచి డీప్ ఫేక్ వీడియోలు.. అలర్ట్‌గా ఉండండి

Deepfake:‘స్కాంగ్రెస్’ నుంచి డీప్ ఫేక్ వీడియోలు.. అలర్ట్‌గా ఉండండి
X

డీప్‌ ఫేక్ వీడియో.. గత కొన్నిరోజులుగా అటు సోషల్ మీడియాలో, ఇటు వార్తల్లో తరచుగా నడుస్తున్న చర్చ. హీరోయిన్ రష్మిక మందన్నకు సంబంధించిన ఓ ఫేక్‌ వీడియో నెట్టింట వైరల్‌ కావడంతో.. దీని గురించి పెద్ద రచ్చ జరుగుతోంది. ఒక వ్యక్తి శరీరానికి మరో వ్యక్తి ముఖాన్ని జోడించి రూపొందించే వీడియోలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. రష్మిక ఫేస్ మార్పింగ్ చేసి సోషల్ మీడియాలోకి వదిలిన ఆ వీడియోపై పలువురు సినీ, రాజకీయ నాయకులు సైతం స్పందించారు. డీప్‌ ఫేక్‌ వీడియోలను తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సైతం దీనిపై దృష్టి సారించింది. ఇక తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సైతం డీప్‌ ఫేక్‌ వీడియోలపై స్పందించిన విషయం తెలిసిందే.

తాజాగా డీప్‌ ఫేక్‌లపై బీఆర్‌ఎస్ శ్రేణులు, సోషల్ మీడియా వారియర్స్‌ను హెచ్చరించారు మంత్రి కేటీఆర్. ఓటింగ్ సమీపిస్తున్న కొద్దీ చాలా డీప్‌ఫేక్‌లు ఉండవచ్చని ఎక్స్ వేదికగా తెలిపారు. ఓటమి అంచున ఉన్న స్కాంగ్రెస్ డీప్‌ఫేక్‌ల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. దీంతో.. బీఆర్‌ఎస్‌ సైనికులు అప్రమత్తతో ఉండి ఓటర్లను చైతన్యపరచాలని సూచించారు. రానున్న రోజుల్లో స్కాంగ్రెస్ నుంచి అర్థరహిత ప్రొపగాండా పెరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఫేక్ డీపీ మహిళలకు మాత్రమే కాదు రాజకీయ నేతలకు సైతం ప్రమాదమే కేటీఆర్ అన్నారు. ప్రత్యర్థులు ఫేక్ డీపీ వాడి మాపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా ఒక్కోసారి టాక్సిక్ గా తయారవుతోందని తెలిపారు.

ఇక డీప్‌ ఫేక్‌ పోస్టుల నియంత్రణకు త్వరలోనే కొత్త నిబంధనలు విడుదల చేస్తామని కేంద్ర కమ్యూనికేషన్స్‌, ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌ తెలిపారు. ఫేక్‌ పోస్టులను రూపొందించిన వారికి శిక్ష, జరిమానాలు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.


Updated : 24 Nov 2023 11:49 AM IST
Tags:    
Next Story
Share it
Top