Home > తెలంగాణ > 'ఒక్క ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి వీళ్లకు?'.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్

'ఒక్క ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి వీళ్లకు?'.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్

ఒక్క ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి వీళ్లకు?.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్
X

హైదరాబాద్ నగరంలోని తాజ్ డెక్కన్ లో జరిగిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలకు 11 సార్లు అవకాశం ఇస్తే ఏం పీకారు? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి వీళ్లకు?.. బోర్ కొట్టిందనీ కొత్త ప్రభుత్వం రావాలని కోరుకుంటారా?.. అభివృద్ది చేసే వాడు ఇంకొన్నేళ్లు ఉంటే తప్పేంటి?.. అని అడిగారు. తొమ్మిదేళ్లలో తాము అసాధారణ విజయాలు సాధించామన్నారు. ఆరున్నర సంవత్సరాల మా పని తీరు, గత 65ఏళ్ల ప్రభుత్వాల పనితీరు మీరు గమనించారు. మూసీ నది సుందరీకరణ చేస్తాం అని కాంగ్రెస్ చెప్తోంది. మూసీ నది నాశనం చేసింది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. కర్ణాటకలో బిల్డర్స్ నుంచి కమిషన్ 40 నుంచి 400 కు పెరిగింది అని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఏమో గానీ ఆరు నెలల కొకసారి సీఎం మారటం మాత్రం పక్కా అని ఎద్దేవా చేశారు. కొంతమంది గిట్టని వాళ్ళు మేము ఓడిపోవాలని కోరుకునే వాళ్ళు ఈ తొమ్మిదేళ్లలో కేసిఆర్ ఏం చేయలేదు అని మాట్లాడుతుంటారు. కానీ కేసిఆర్ ప్రజల మనిషి అని అన్నారు.

హైదరాబాద్ లో అభివృద్ది ఇప్పటి దాకా చేసింది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందుంది అని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. పెట్టుబడులు వస్తేనే కదా నగరంలో సంపద పెరుగుతోందన్నారు. ప్రాధాన్యతా క్రమంలో సమస్యలన్నీ పరిష్కరిస్తున్నామని.. వచ్చే ప్రభుత్వంలో మరింత వేగంగా హైదరాబాద్ అభివృద్ధి చేసి చూపిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ జిల్లాలు, హైదరాబాద్‌లో భూముల విలువ గతంలో కంటే 20 శాతం పెరిగిందన్నారు గతంలో వ్యవసాయ రంగం కుంటు పడిందని అందుకే ఆనాడు భూముల విలువ లేదు అని తెలిపారు. భవిష్యత్తులో ఓఆర్‌ఆర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య సరికొత్త హైదరాబాద్‌ తయారవుతుందని.. ఆర్ఆర్ఆర్ బయట కూడా కొత్త . 332 కిలో మీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని తెలిపారు. తెలంగాణ జిల్లాలకు వెళ్లే మార్గం సులభం చేయాలని ప్రయత్నం చేస్తున్నామన్నారు."హైదరాబాద్‌కు రాకపోకలు చాలా సులువుగా జరగాలి. త్వరలో ప్రతిరోజూ తాగునీరు ఇచ్చేలా చూస్తాం. ఐటీ ఉద్యోగాల కల్పనలో రెండేళ్లుగా బెంగళూరును అధిగమించాం. అభివృద్ది, రాష్ట్ర ప్రగతి కొనసాగాలంటే కేసిఆర్ మళ్ళీ రావాలి" అని మంత్రి కేటీఆర్ సూచించారు.

Updated : 14 Nov 2023 12:30 PM IST
Tags:    
Next Story
Share it
Top