Home > తెలంగాణ > బీఆర్ఎస్ ఎప్పుడైనా ఆటో డ్రైవర్లకు సాయం చేసిందా..? : Ponnam Prabhakar

బీఆర్ఎస్ ఎప్పుడైనా ఆటో డ్రైవర్లకు సాయం చేసిందా..? : Ponnam Prabhakar

బీఆర్ఎస్ ఎప్పుడైనా ఆటో డ్రైవర్లకు సాయం చేసిందా..? : Ponnam Prabhakar
X

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ - కాంగ్రెస్ సభ్యుల మాటల యుద్దం జరిగింది. బస్సులు సరిపడా లేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్ల బతుకులు రోడ్డున పడ్డాయని చెప్పారు. రెండు నెలల్లో 21మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పల్లా వ్యాఖ్యలకు పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు.

ఆటో కార్మికులను బీఆర్ఎస్ రెచ్చగొడుతోందని ఆరోపించారు. గత పదేళ్లలో ఆర్టీసీ సంక్షేమానికి బీఆర్ఎస్ గాలికొదిలేసిందని మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందా చెప్పాలని ప్రశ్నించారు. ఉచిత బస్సు ప్రయాణం స్కీంను బీఆర్ఎస్ తట్టుకోలేకపోతుందని విమర్శించారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లు బీఆర్ఎస్ నేతల మాటలున్నాయని ఎద్దేవా చేశారు. ఆటోడ్రైవర్లను అన్ని విధాల ఆదుకుంటామని తెలిపారు.

ఆర్టీసీలో కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఉచిత బస్సు టికెట్లకు ఆర్టీసీకి తమ ప్రభుత్వం రూ.530 కోట్లను ఇచ్చినట్లు తెలిపారు. బీఆర్ఎస్ ఎప్పుడైన ఆటో డ్రైవర్లకు సాయం చేసిందా అని ప్రశ్నించింది. గత పదేళ్లలో ఆటో డ్రైవర్లకు నెలకు రూ.1000 అయినా ఇచ్చారా అని నిలదీశారు. సభను తప్పుదోవ పట్టించేలా హరీష్ రావు మాట్లాడుతున్నారని ఆరోపించారు. రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ను ఆర్టీసీ ఎండీగా పెట్టిన చరిత్ర బీఆర్ఎస్ది అని మండిపడ్డారు.

Updated : 9 Feb 2024 12:35 PM IST
Tags:    
Next Story
Share it
Top