Home > తెలంగాణ > రాజకీయాల కోసం దేవుడిని వాడుకోవడం సిగ్గుచేటు : పొన్నం

రాజకీయాల కోసం దేవుడిని వాడుకోవడం సిగ్గుచేటు : పొన్నం

రాజకీయాల కోసం దేవుడిని వాడుకోవడం సిగ్గుచేటు : పొన్నం
X

రాముడి చరిత్రను రాజీవ్ గాంధీ వెలికితీశారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజకీయాల కోసం దేవుడిని వాడుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. దీనిపై ప్రశ్నిస్తే హిందూ వ్యతిరేకులు అంటున్నారని మండిపడ్డారు. దేశంలో 6 శాస్త్రాలు, 18 పురాణాలు, 12 ద్వాదశ లింగాలు, 18 జ్యోతి లింగాలు, నాలుగు వేదాలు, నలుగురు జగద్గురులు ఉన్నారని.. వాళ్ల చేతులపై జరగాల్సిన మహోత్సవాన్ని ఓట్ల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై హిందువులు ఆలోచించాలని కోరారు. దేవుడు కొందరికే సొంతం కాదని.. అందరి వాడని చెప్పారు.

దేశంలో బీజేపీ ప్రతిష్ఠ రోజురోజుకు దిగజారుతోందని పొన్నం విమర్శించారు. అయినా ఆ పార్టీ నీచ రాజకీయాలను ఆపడం లేదన్నారు. రాజన్న సిరిసల్ల జిల్లాలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా వేములవాడ రాజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా పడి.. రైతులు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. బీజేపీ ఎన్ని జిమ్మిక్కులు చేసిన వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు. రాహుత్ యాత్ర కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరిగేలా చేస్తుందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Updated : 14 Jan 2024 11:57 AM IST
Tags:    
Next Story
Share it
Top