Home > తెలంగాణ > ఎంపీ ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం.. మంత్రి పొన్నం ప్రభాకర్

ఎంపీ ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం.. మంత్రి పొన్నం ప్రభాకర్

ఎంపీ ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం.. మంత్రి పొన్నం ప్రభాకర్
X

రానున్న ఎంపీ ఎన్నికల్లోనూ సత్తా చాటుతామని మంత్రి పొన్న ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ ఇంఛార్జ్ మంత్రిగా నియామకం అయిన తర్వాత మొదటిసారి ఆయన హైదరాబాద్ కు చెందిన టీపీసీసీ ముఖ్య నేతలతో గాంధీభవన్ లో సమావేశమయ్యారు. ఎంపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా నేతలకు మంత్రి పలు సూచనలు చేశారు. ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని, ఇక రానున్న ఎంపీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని అన్నారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా రాలేదని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలన్నారు. హైదరాబాద్ రాష్ట్రానికి గుండెకాయ లాంటిదని, ఎంపీ ఎన్నికల్లో గెలిస్తేనే మున్సిపల్ ఎన్నికలకు మార్గం సుగమం అవుతుందని అన్నారు. అందుకోసం పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి కోసం కృషి చేయాలని, ప్రతి ఒక్కరూ సమిష్టిగా కష్టపడితేనే విజయం సాధిస్తామని అన్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారు బాధపడొద్దని, వారికి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు సీనియర్ నాయకులు వీహెచ్, అంజనీకుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Updated : 26 Dec 2023 12:08 PM GMT
Tags:    
Next Story
Share it
Top