Padi Kaushik Reddy : BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మంత్రి పొన్నం కౌంటర్
X
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Padi Kaushik Reddy)కి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్‌పై చర్చ నడుస్తుండా.. సభలో మాట్లాడుతున్న మంత్రి పొన్నంను కూర్చోవాలంటూ కౌశిక్ రెడ్డి రన్నింగ్ కామెంటరీ చేశారు. దీంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము భయపెడితే భయపడే రకం కాదని.. మీరు కూర్చో అనగానే కూర్చోడానికి తాము పాలేర్లము కాదన్నారు. తనకు ఓట్లు వేయకపోతే భార్య పిల్లలతో కలిసి శవయాత్ర చూడాల్సి వస్తుందంటూ ఓటర్లను బెదిరించిన వ్యక్తి తనను కూర్చోమని బెదిరిస్తారా అని మంత్రి పొన్నం మండిపడ్డారు.
ఇక కడియం శ్రీహరి వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar ) కౌంటర్ ఇచ్చారు. కడియం సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కుర్చీవేసుకోని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని కేసీఆర్ మాటలు ఏమయ్యాయని నిలదీశారు. గౌరవెల్లి కింద కాల్వలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు
ఇక మండలిలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లను, నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తోందని మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుంటే బీఆర్ఎస్ నేతలు చూసి ఓర్వలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు మహాలక్ష్మీ పథకం వర్తింప చేయంటారా? వద్దా? ప్రతిపక్షం చెప్పాలని ప్రశ్నించారు. గత ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టి ఇవ్వలేదని తెలిపారు.