Home > తెలంగాణ > స్వామిగౌడ్ ఇంటికెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

స్వామిగౌడ్ ఇంటికెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

స్వామిగౌడ్ ఇంటికెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
X

మాజీ శాసన మండలి చైర్శన్ స్వామి గౌడ్ కాంగ్రెస్ పార్టీలోకి చేరనట్లు తెలుస్తోంది. ఇవాళ ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్‌తో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లోకి వస్తే తగిన ప్రాధాన్యం ఇస్తామని మంత్రి హామి ఇచ్చినట్లు సమాచారం ఎన్జీవో నాయకుడుగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన స్వామిగౌడ్.. బీఆర్ఎస్ తో తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసన మండలికి ఎన్నికయ్యారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత శాసన మండలి తొలి చైర్మన్ గా ఆయనకు కీలక పదవి అప్పగించారు కేసీఆర్.

2020లో ఆయన బీఆర్ఎస్ ని వీడి బీజేపీ కండువా కప్పుకున్నారు. అయితే అక్కడ కూడా ఆయన ఉండలేకపోయారు. 2022లో తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత స్వామిగౌడ్ తన రాజకీయ భవిష్యత్ గురించి పునరాలోచించారు. ఇప్పుడు కాంగ్రెస్ లోకి వస్తున్నారు. తెలంగాణ ఎన్నికల ముందు చాలామంది నాయకులు కండువాలు మార్చేశారు. టికెట్ దొరకని ఆశావహులు పక్క పార్టీలోకి వచ్చి పోటీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాత్రం నెలరోజులకు పైగా కండువాల పండగకు విరామం వచ్చింది. మళ్లీ ఇప్పుడు ఆ సీజన్ మొదలైనట్టుంది. స్వామిగౌడ్ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు.


Updated : 18 Jan 2024 3:19 PM IST
Tags:    
Next Story
Share it
Top