Home > తెలంగాణ > రాష్ట్రంలో బీసీ బంధు స్కీమ్ నిలిపివేత: మంత్రి పొన్నం ప్రభాకర్

రాష్ట్రంలో బీసీ బంధు స్కీమ్ నిలిపివేత: మంత్రి పొన్నం ప్రభాకర్

రాష్ట్రంలో బీసీ బంధు స్కీమ్ నిలిపివేత: మంత్రి పొన్నం ప్రభాకర్
X

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా రాష్ట్రంలో బీసీ బంధు స్కీంను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఆదివారం గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన పొన్నం.. బీసీ బంధు స్కీమ్ లో గత ప్రభుత్వం గందరగోళం సృష్టించిందని అన్నారు. పథకం అమలుపై పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. బీసీ వర్గంలోని పేద ప్రజలకు రూ. లక్ష ఆర్థిక సాయం అందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో బీసీ బంధు స్కీంను ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకం అమలులో అవకతవకలు జరిగే అవకాశం ఉందని, అందుకే తమ ప్రభుత్వం పథకం అమలు నిలిపివేసి.. పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించి పారదర్శకంగా అమలు చేస్తామని పొన్నం చెప్పుకొచ్చారు.

కాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా రైతు బంధు డబ్బులను రైతుల ఖాతాలో జమ చేయలేదు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు తమను విమర్శించడాన్ని తప్పుబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు రోజులే అవుతుందని, అప్పుడే తమను విమర్శించడమేంటని మండిపడ్డారు. అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని అన్నారు. రానున్న 100 రోజుల్లో మిగతా నాలుగు గ్యారంటీలను తప్పక అమలు చేసిన తీరతామని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి సంక్షేమానికి కృషి చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అన్నారు.

Updated : 11 Dec 2023 8:54 AM IST
Tags:    
Next Story
Share it
Top