Home > తెలంగాణ > బీఆర్ఎస్లో సీఎం, కాబోయే సీఎం ఇద్దరూ ఉన్నారు : పువ్వాడ

బీఆర్ఎస్లో సీఎం, కాబోయే సీఎం ఇద్దరూ ఉన్నారు : పువ్వాడ

బీఆర్ఎస్లో సీఎం, కాబోయే సీఎం ఇద్దరూ ఉన్నారు : పువ్వాడ
X

ఖమ్మం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధికి కేటీఆర్ కారణమని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాబోయే రోజుల్లో కాబోయే సీఎం కేటీఆర్‌ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు దమ్ముంటే వారి ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు చెప్పాలని డిమాండ్‌ చేశారు. గొంగలి పురుగులా ఉన్న ఖమ్మం పట్టణాన్ని సీతాకోక చిలుకలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు.

ఖమ్మానికి తన అవసరం తీరిన రోజు మాత్రమే రాజకీయాల నుంచి వైదొలుతానని పువ్వాడ చెప్పారు. ఖమ్మం నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక పలువురు అడ్డంకులు సృష్టించినా వాటిని అధిగమించి అభివృద్ధి చేశామన్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అవినీతి రహిత కార్పొరేషన్‌గా నిలిచిందని చెప్పారు. రాబోయే రోజుల్లో 23 కిలోమీటర్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని నిర్మించనున్నామని తెలిపారు.


Updated : 16 Jun 2023 5:01 PM IST
Tags:    
Next Story
Share it
Top