Home > తెలంగాణ > ఏపీ రాజకీయాల్లోకి షర్మిల.. రోజా ఏమన్నారంటే..?

ఏపీ రాజకీయాల్లోకి షర్మిల.. రోజా ఏమన్నారంటే..?

ఏపీ రాజకీయాల్లోకి షర్మిల.. రోజా ఏమన్నారంటే..?
X

ఏపీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల కాంగ్రెస్‌లో చేరుతారని టాక్ వినిపిస్తోంది. గురువారం ఢిల్లీలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని ప్రచారం నడుస్తోంది. షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ ఏపీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. షర్మిల అంశంపై మంత్రి రోజా స్పందించారు. షర్మిల కాంగ్రెస్లో చేరడంలో తమకు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వస్తున్నారని ప్రచారం జరుగుతోందని మీడియా ప్రతినిధి రోజాను ప్రశ్నించగా.. మీకేమైనా ఇబ్బందా అంటూ ఆమె కామెంట్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏ పార్టీలోకి వైళ్లొచ్చని.. ఎక్కడి నుంచైనా రాజకీయాలు చేయొచ్చని అన్నారు.

కాగా ఏపీలో కాంగ్రెస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఏపీ విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ కనీసం ఒక్క సీటును కూడా సాధించలేకపోయింది. ఈ క్రమంలో ఈ సారి చెప్పుకోదగ్గ సీట్లన్న సాధించాలని ప్లాన్ వేస్తోంది. ఏపీ పగ్గాలను వైఎస్ షర్మిలకు అప్పగిస్తే పార్టీ పుంజుకుంటుందని భావిస్తోంది. వైఎస్సార్ చరిష్మాతో ఆయన బిడ్డగా షర్మిల పేరు పార్టీకి కలిసొస్తుందని లెక్కలు వేస్తోంది. షర్మిల కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇతర పార్టీల్లోని ముఖ్యనేతలు సైతం హస్తం గూటికి చేరుకుంటారని హైకామండ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. వైసీపీతో ఉన్నది కాంగ్రెస్ ఓటర్లేనని.. రాజన్న బిడ్డగా షర్మిల బాధ్యతలు తీసుకుంటే వారంత మళ్లా పార్టీ వైపు మళ్లుతారని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

Updated : 27 Dec 2023 8:14 PM IST
Tags:    
Next Story
Share it
Top