రైతు బంధుపై కామెంట్స్.. హరీష్ రావుకు సీతక్క కౌంటర్
X
తెలంగాణలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. రైతు బంధు నిధులు ఎప్పుడు ఇస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. రైతాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తోందన్నారు. అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలో వడ్లు అమ్ముకోకండి.. తాము బోనస్‌తో వడ్లు కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ నేతలు రైతులకు హామీ ఇచ్చారని.. రూ. 500 బోనస్‌తో వడ్లు ఎప్పుడు కొంటారో చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క స్పందించారు.
పెద్ద పెద్ద ఫామ్ హౌస్‌లకు రైతు బంధు పడలేదని బీఆర్ఎస్ నేతలు బాధపడుతున్నారని సీతక్క సెటైర్ వేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు నియామాలను వారికి అవసరమైన విధంగా పెట్టుకున్నారని ఆరోపించారు.
ఈ స్కీమ్ విధివిధానాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరిపిన తర్వాత రైతులకు రైతు బంధు నిధులు జమ చేస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ శాఖను అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. ఇక తనకు కేటాయించిన శాఖలను బాధ్యతతో నెరవేరుస్తానని చెప్పారు,