Home > తెలంగాణ > అదంతా పార్టీ ఖర్చే.. రాష్ట్ర ఖజానాది రూపాయి వాడలేదు: మంత్రి సీతక్క

అదంతా పార్టీ ఖర్చే.. రాష్ట్ర ఖజానాది రూపాయి వాడలేదు: మంత్రి సీతక్క

అదంతా పార్టీ ఖర్చే.. రాష్ట్ర ఖజానాది రూపాయి వాడలేదు: మంత్రి సీతక్క
X

రాహుల్ గాంధీ పాదయాత్రకు తెలంగాణ నుంచి బస్సులు ఏర్పాటు చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్టానికి తెలంగాణ ఏటీయంగా మారిందని విమర్శించారు. దీనిపై స్పందించిన మంత్రి సీతక్క.. కవితకు కౌంటర్ వేశారు. కాంగ్రెస్ అధిష్టానానికి పెట్టిన ఖర్చు.. ప్రభుత్వం ఖజానాలోనిది కాదని స్పష్టం చేశారు సీతక్క. అదంతా పార్టీ ఖర్చు మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. గత కాంగ్రెస్ పాలన సమయంలో మహారాష్ట్ర, పంజాబ్ రైతులు నిధులు ఇచ్చారని, వాటిని కాంగ్రెస్ వినియోగిస్తుందని చెప్పారు. గతంలో రేవంత్ రెడ్డి వినియోగించిన బస్సునే రాహుల్ యాత్రకు అప్పగించినట్లు సీతక్క చెప్పుకొచ్చారు.

అంతకు ముందు మీడియా సమావేశం నిర్వహించిన కవిత.. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ఆత్మస్తుతి, పరనింద అన్నట్లుగా ఉందని విమర్శించారు. పాత పెన్షన్ ఇవ్వడానికి కొత్త ప్రభుత్వం ఎందుకని ప్రభుత్వంపై కవిత మండిపడ్డారు. ఆరు గ్యారంటీలకు సంబంధించి బడ్జెట్ లో పది శాతం కూడా కేటాయించలేదని ఆరోపించారు. ప్రజావాణి వారి చెవిన పడటం లేదు, కేవలం ఢిల్లీ వాణి మాత్రమే వింటున్నారని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వాన్ని నిందించడం కోసమే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారని అన్నారు. రాహుల్ గాంధీ యాత్ర చేస్తే.. తెలంగాణ నుంచి బస్సులు పోతున్నాయని, తెలంగాణ ఏఐసీసీకి ఏటీయంగా మారిపోయిందని కవిత ఆరోపించారు.

మహిళకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి గతం ప్రభుత్వంలో ఉన్న బస్సులను వాడుతున్నారని అన్నారు. మహాలక్షీ స్కీంలో భాగంగా తులం బంగారం ఇస్తామని చెప్పి.. ఇంతవరకు దాని ఊసుతీయలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు పెరిగాయని, కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు మరిచిందని కవిత విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న 1.39 లక్షల మంది మహిళలకు ఇస్తానన్న రూ.2,500 పెన్షన్ ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. ఈ కవిత వాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క.




Updated : 14 Feb 2024 11:22 AM GMT
Tags:    
Next Story
Share it
Top