Home > తెలంగాణ > సంతకం చేసిన రోజే.. అంగన్వాడీలకు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క

సంతకం చేసిన రోజే.. అంగన్వాడీలకు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క

సంతకం చేసిన రోజే.. అంగన్వాడీలకు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క
X

తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పారు. బాధ్యతలు చేపట్టిన రోజే తొలి కీలక ఫైల్ పై సంతకం చేశారు. అంగన్వాడీ టీచర్ల జీతాన్ని ఏకంగా రూ.6వేలకు పెంచారు. ఇకపై వారికి నెలకు రూ. 13,500 నెల జీతం అందనుంది. ప్రస్తుతం రూ.7,500 ఇస్తున్నారు. సీతక్క గురువారం మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. జీతం పెంపుతో పాటు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్చారు. సీతక్క నిర్ణయంపై అంగన్వాడీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఏపీలోని అంగన్వాడీలు జీతం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. పలు చోట్ల నిరాహార దీక్షలకు, భిక్షాటనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డుపై భైఠాయించి నిరసనలు తెలుపుతున్నారు.

Updated : 14 Dec 2023 8:39 PM IST
Tags:    
Next Story
Share it
Top