Home > తెలంగాణ > రోడ్డు పక్కన మొక్కజొన్నకంకులు కొన్న మంత్రి సీతక్క

రోడ్డు పక్కన మొక్కజొన్నకంకులు కొన్న మంత్రి సీతక్క

రోడ్డు పక్కన మొక్కజొన్నకంకులు కొన్న మంత్రి సీతక్క
X

తెలంగాణ పంచాయితీరాజ్ శాఖ మంత్రి సీతక్క తన మంచి మనుసు, సేవగుణంతో ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. అందుకే ఆమెను ప్రజలంతా సీతక్కా అని ప్రేమగా పిలుచుకుంటారు. ఆమె ఎంత నిరాడంబరంగా వుంటారో తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో మరోసారి బయటపడింది. సీతక్క పలు కార్యక్రమంలో పాల్గొన్నారు. సామాన్యులతో కలిసి భోజనం చేశారు. రోడ్డు పక్కనే మొక్క జొన్న కంకులను కొని తిన్నారు. నిర్మల్ జిల్లాలోని కడెం నుంచి మార్లవాయికి వెళుతున్న క్రమంలో దారిలో ఉడుంపూర్ వద్ద ఆగి మొక్కజొన్న అమ్ముకుంటున్న రైతు వద్ద ఆగి కంకులను కొనుక్కొని తిన్నారు. రోజంతా జిల్లాలోనే పర్యటించనున్న నేపథ్యంలో మంత్రికి మార్లవాయి గ్రామస్తులు భోజనం ఏర్పాటుచేసారు.

ఈ క్రమంలోనే గ్రామస్తులు చూపిన ప్రేమకు ముగ్దురాలయిన సీతక్క వారితో కలిసే నేలపై కూర్చుని భోజనం చేసారు. మంత్రి సింప్లిసిటీని చూసి ఆమె వెంటున్న ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు ఆశ్చర్యపోగా గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేసారు. అంతకుముందు కడెం నుండి మార్లవాయికి వెళుతుండగా రోడ్డుపక్కన మొక్కజొన్న కంకులు అమ్ముకుంటున్న మహిళను గమనించారు సీతక్క. వెంటనే తన కాన్వాయ్ ని ఆపి ఆ మహిళ వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. ఆ మొక్కజొన్న కంకులను అడిగిమరీ కాల్పించుకున్న మంత్రి అక్కడే తిన్నారు. చాలా రూచిగా వున్నాయని చెప్పి ఆమె వద్ద ఉన్న కంకులన్నింటినీ కొనుగోలు చేసారు. అనంతరం ప్రాజెక్టు వరద గేట్లను ప్రాజెక్టు స్థితిగతులను పరిశీలించి ప్రాజెక్టు సీఈ శ్రీనివాస్ ను ప్రాజెక్టు స్థితిగతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.


Updated : 19 Jan 2024 2:19 PM IST
Tags:    
Next Story
Share it
Top