Home > తెలంగాణ > Minister Seethakka : మేడారం జాతర అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి సీతక్క

Minister Seethakka : మేడారం జాతర అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి సీతక్క

Minister Seethakka : మేడారం జాతర అభివృద్ధి  పనులను పరిశీలించిన మంత్రి సీతక్క
X

ములుగు జిల్లాలోని మేడరం జాతర అభివృద్ధి పనులను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పరిశీలించారు. అనంతరం పారిశుద్ద్యకార్మికులతో కలిసి రోడ్లును శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ సమ్మక్క సారక్క జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు గురికాకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. మేడారంలో ఎవరు ప్లాస్టిక్ ఉపయోగించవద్దని కోరారు. ప్లాస్టిక్ అమ్మినా..వినియోగించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆపై కొండాయి గ్రామంలోని గోవిందరాజులు, నాగులమ్మ , సారలమ్మలను మంత్రి సీతక్క దర్శించుకున్నారు.

దొడ్ల వద్ద జంపన్నవాగుపై కూలిపోయిన బ్రిడ్జిని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. గత సంవత్సరం వరదలకు గోవిందరాజులు, సారలమ్మ, నాగులమ్మ ఆలయ ప్రాంతాలు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. జాతర ప్రాంగణం, వివిధ మరమ్మత్తులకు బడ్జెట్ రిలీజ్ చేశామన్నారు. జాతర పనుల బిల్లులు ఇవ్వడంలో గత ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిందన్నారు. పాత బిల్లులు రాలేదని కాంట్రాక్టర్లు ప్రస్తుత జాతర పనులను ఆపితే ఊరుకునేది లేదన్నారు. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఫారెస్ట్ అనుమతులు లేకపోవడంతో కొన్ని రోడ్ల నిర్మాణాలు ఆలస్యం అవుతున్నాయన్నారు. మరో నాలుగు రోజుల్లో అన్ని రోడ్ల నిర్మాణాలు పూర్తవుతాయని మంత్రి సీతక్క తెలిపారు. ఆ తర్వాత కన్నెపల్లిలో సారలమ్మ దేవాలయం వద్ద పరిశీలించారు. పూజారులు, అధికారులతో కలిసి అభివృద్ధి పనులపై ఆరా తీశారు. జంపన్నవాగు వద్దకు కూడా వెళ్లారు. మేడారం గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వచ్ఛ మేడారం కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated : 3 Feb 2024 4:01 PM GMT
Tags:    
Next Story
Share it
Top