Home > తెలంగాణ > మేడారంలో పోలీస్ కంట్రోల్ కమాండ్ రూంను ప్రారంభించిన సీతక్క

మేడారంలో పోలీస్ కంట్రోల్ కమాండ్ రూంను ప్రారంభించిన సీతక్క

మేడారంలో పోలీస్ కంట్రోల్ కమాండ్ రూంను ప్రారంభించిన సీతక్క
X

మేడారంలో నిర్మించిన పోలీసు కమాండ్ కంట్రోల్‌ రూం ప్రారంభించారు మంత్రి సీతక్క. సమ్మక్క-సారలమ్మ ఆలయం వద్ద ఉన్న ఈ కమాండ్‌ కంట్రోల్ రూం నిర్మాణానికి.. రూ.90 లక్షల ఖర్చయింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీతక్క.. తాను ఏ స్థాయిలో ఉన్నా.. ములుగుకు ఆడబిడ్డనేనని చెప్పారు. ఒక సేవకురాలిగా ములుగు ప్రజలకు ఎల్లప్పుడూ సేవలందిస్తానని చెప్పుకొచ్చారు.

ఏ అడ్డంకి ఎదురైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఐదు హామీలను తప్పక అమలు చేసి తీరతామని అన్నారు. గ్రామాల అభివృద్ధికి తనకు పంచాయితీ రాజ్ శాఖ ఇచ్చారని.. మారుమూల గ్రామాల అభివృద్ధికి తప్పక కృషి చేస్తానని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల ప్రాంతాలు మాత్రమే అభివృద్ది చెందాయని సీతక్క విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ.. పనిచేస్తామని సీతక్క తెలిపారు.

Updated : 17 Dec 2023 4:07 PM IST
Tags:    
Next Story
Share it
Top