Home > తెలంగాణ > Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కడియం వర్సెస్ శ్రీధర్ బాబు

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కడియం వర్సెస్ శ్రీధర్ బాబు

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కడియం వర్సెస్ శ్రీధర్ బాబు
X

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బడ్జెట్ పై చర్చను ప్రారంభించారు. అసెంబ్లీలో కోరం లేకపోవడంతో సమావేశాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం అభ్యంతరం వ్యక్తం చేశారు. బడ్జెట్ పై చర్చ జరుగుతుంటే సీఎం సభలో లేరన్నారు కడియం. ప్రభుత్వ చిత్తశుద్ధి ఎంటో ఇక్కడ కనిపిస్తోందన్నారు. ప్రభుత్వానికి అసెంబ్లీ చర్చపై సీరియస్ నెస్ లేదన్నారు . దీంతో సభను వాయిదా వేయాలని కోరారు. దీనికి మంత్రి శ్రీధర్ బాబు బదులిస్తూ కోరం లేదంటూ సభను వాయిదా వేయాలనడం సరికాదన్నారు. పూర్తి స్థాయిలో ఉందన్నారు. కోరం అంటే 12 మంది సభ్యులు ఉంటే చాలని శ్రీధర్ బాబు అన్నారు. సీఎం, ఆర్థిక మంత్రి అనివార్య కారణాల వల్ల సభకు హాజరు కాలేదని చెప్పారు. మొత్తం సభ్యుల సంఖ్యలో 10 శాతం మంది సభలో ఉన్నారని మంత్రి అన్నారు.

ఈ క్రమంలోనే కడియం... ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఎమర్జెన్సీ, ఆరాచకం. అన్నారు. 1969 లో తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసిందెవరన్నారు. దేశంలో ఆర్థిక అసమానతలకు కారణమెవరని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలోనే తెలంగాణ ఉద్యమకారులపై తూటాలు పేలాయన్నారు. తెలంగాణ మలి దశ ఉద్యమం నడిపింది కేసీఆర్ అని, ఆయన గురించి బడ్జెట్ లో ప్రస్తావనే లేదన్నారు. కేసీఆర్‌ను విమర్శించడమే తప్ప బడ్జెట్ లో ఇంకేం లేదన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ 420 హామీలిచ్చిందని, ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో 13 హామీలున్నాయన్నారు. ఆరు గ్యారంటీలకు ఈ బడ్జెట్ ఏ మూలకు సరిపోదన్నారు.

ఇవాళ అసెంబ్లీలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై చర్చ జరుగనుంది. చర్చ అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్‌పై చర్చకు సమాధానం ఇవ్వనున్నారు. ఆ తర్వాత 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సప్లిమెంటరీ ఎస్టిమేట్స్‌ ఆఫ్‌ ఎక్స్‌పెండీచర్‌పై చర్చ చేపట్టి, సమాధానం ఇచ్చి, ఓటింగ్‌ నిర్వహించనున్నారు. అదేవిధంగా శాసన మండలిలో కూడా ఇవాళ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై చర్చ జరుగనుంది. చర్చ అనంతరం ఆ చర్చకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమాధానం ఇస్తారని ఆయన మరో ప్రకటనలో తెలియజేశారు. ఇక, నేడు సాగునీటిపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసే చాన్స్ ఉంది.




Updated : 14 Feb 2024 11:22 AM IST
Tags:    
Next Story
Share it
Top