Home > తెలంగాణ > నవ్విపోదురుగాక నాకేంటి అన్నట్లుగా బీఆర్ఎస్ తీరుంది : శ్రీధర్ బాబు

నవ్విపోదురుగాక నాకేంటి అన్నట్లుగా బీఆర్ఎస్ తీరుంది : శ్రీధర్ బాబు

నవ్విపోదురుగాక నాకేంటి అన్నట్లుగా బీఆర్ఎస్ తీరుంది : శ్రీధర్ బాబు
X

బీఆర్ఎస్ పై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ 420 పేరుతో బీఆర్ఎస్ బుక్ రిలీజ్ చేయడాన్ని ఆయన ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ 3550 రోజులు పాలిస్తే.. తాము వచ్చి 35 రోజులు కూడా కాలేదన్నారు. కాంగ్రెస్పై బీఆర్ఎస్ నేతల ఆరోపణలు సిగ్గుచేటన్నారు. వచ్చిన 48 గంటల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేసినట్లు చెప్పారు. రాజీవ్ ఆరోగ్య శ్రీని రూ.10 లక్షలకు పెంచడంతోపాటు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. 6.5 కోట్ల మంది ఉచిత బస్సు సర్వీసును వినియోగించుకున్నారని చెప్పారు. ప్రజా రవాణాను మెరుగుపరిచామన్నారు.

పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఓడిన తర్వాత కూడా బీఆర్ఎస్ నేతల్లో మార్పు రాలేదని శ్రీధర్ బాబు విమర్శించారు. నియంతృత్వ ధోరణిలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారని.. బీఆర్ఎస్కు ప్రజలపై ప్రేమ ఉంటే.. విలువైన సలహాలు ఇవ్వాలని సూచించారు. కానీ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైన కాకముందు బీఆర్ఎస్ నేతలు గగ్గోలు పెట్టడం ఏంటని అడిగారు. నవ్విపోదురుగాక నాకేంటి అన్నట్లుగా బీఆర్ఎస్ తీరు ఉందని ఆరోపించారు. తమ పాలనను ప్రజలు గమనిస్తున్నారని.. కాంగ్రెస్ పాలన పట్ల సంతోషంగా ఉన్నారని అన్నారు.


Updated : 4 Jan 2024 6:26 PM IST
Tags:    
Next Story
Share it
Top