Home > తెలంగాణ > Sridhar Babu : వరంగల్ ప్రజలకు మంత్రి శ్రీధర్ బాబు గుడ్ న్యూస్

Sridhar Babu : వరంగల్ ప్రజలకు మంత్రి శ్రీధర్ బాబు గుడ్ న్యూస్

Sridhar Babu : వరంగల్ ప్రజలకు మంత్రి శ్రీధర్ బాబు గుడ్ న్యూస్
X

వరంగల్ జిల్లా ప్రజలకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఓరుగల్లును హైదరాబాద్‌కు ధీటుగా అభివృద్ధి చేస్తామని హామి ఇచ్చారు. త్వరలో నూతన పారిశ్రామిక విధానం తీసుకొస్తామని వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి నైపుణ్య వర్సిటీలను ఏర్పాటు చేస్తామని వరంగల్ జిల్లాను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని మాటిచ్చారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్కిల్​ యూనివర్సిటీలను ప్రారంభిస్తామని తెలిపారు. త్వరలోనే వరంగల్​ నగరంలో పెద్ద ఎత్తున పరిశ్రమలతో పాటు బహుళజాతి కంపెనీలను తీసుకువస్తామని అన్నారు. హైదరాబాద్​ తరహాలో వరంగల్ జిల్లాను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని తెలిపారు. అంతకు ముందు హనుమకొండలోని పద్మాక్షి అమ్మవారిని మంత్రి శ్రీధర్​ బాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, కోరిన కోరికలను తీర్చే పద్మాక్షి అమ్మవారిని ప్రతినిత్యం కుటుంబ సమేతంగా దర్శించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఆలయ పూజారులు ఇచ్చిన వినతిపత్రాన్ని తీసుకున్న మంత్రి, ఆ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Updated : 18 Feb 2024 9:46 PM IST
Tags:    
Next Story
Share it
Top