Home > తెలంగాణ > ఐటీలో తెలంగాణను అగ్రగామిగా నిలుపుతాం : శ్రీధర్ బాబు

ఐటీలో తెలంగాణను అగ్రగామిగా నిలుపుతాం : శ్రీధర్ బాబు

ఐటీలో తెలంగాణను అగ్రగామిగా నిలుపుతాం : శ్రీధర్ బాబు
X

ఐటీ రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలుపుతామని మంత్రి శ్రీధర్ బుబు తెలిపారు. రాష్ట్ర యువతకు వీలైనంత ఎక్కువగా ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన ఐటీఐఆర్‌ విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డి సహా కేంద్రంతో చర్చిస్తామని చెప్పారు. ఫార్మాసిటీ విషయంలో ప్రజల ఆలోచనలనూ పరిగణనలోకి తీసుకుంటామన్నారు. శాసనసభలో ఫలవంతమైన చర్చలు జరిగేలా చూస్తామని స్పష్టం చేశారు.

కాగా కేటీఆర్ తర్వాత ఐటీ మంత్రి ఎవరన్నదానిపై రాష్ట్రమంతా జోరుగా చర్చ నడిచింది. ఈ క్రమంలో విద్యావంతుడైన శ్రీధర్ బాబుకు రేవంత్ ఐటీ బాధ్యతలు అప్పజెప్పారు. ఆయనకు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.తన తండ్రి స్పీకర్ శ్రీపాదరావు మరణంతో శ్రీధర్ బాబు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందిన ఆయన 1998లో ఏపీ హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. అయితే 1999లో శ్రీపాదరావును నక్సల్స్ కాల్చిచంపడంతో తండ్రి వారసత్వాన్ని కొనసాగించేందుకు శ్రీధర్ బాబు రాజకీయాల్లోకి వచ్చారు. 1999లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004లో మరోసారి గెలిచి కాంగ్రెస్ విప్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2009, 2018లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కావడం విశేషం. 2010 నుంచి 2014 వరకు ఆయన సివిల్ సప్లై, న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు.

Updated : 9 Dec 2023 7:13 PM IST
Tags:    
Next Story
Share it
Top