Home > తెలంగాణ > అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా నిలబెడతాం: మంత్రి శ్రీధర్‌బాబు

అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా నిలబెడతాం: మంత్రి శ్రీధర్‌బాబు

అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా నిలబెడతాం: మంత్రి శ్రీధర్‌బాబు
X

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు ఉండవని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంపైన కక్ష సాధింపు చర్యలు ఉండవని.. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నడుపుతామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందరినీ కలుపుకు పోయి.. పాలన జరుపుతామని అన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలు ఉపయోగకరంగా ఉంటే.. వాటిని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.

రాబోయే బడ్జెట్‌లో తెలంగాణలోని అన్ని రంగాలకు, అన్ని వర్గాలకు ప్రాధాన్యమిస్తూ.. బడ్జెట్ రూపొందిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో యువతకు ఉద్యోగ కల్పన దిశగా చర్యలు చేపడతాం. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని శ్రీధర్‌బాబు చెప్పుకొచ్చారు. అంతకుముందు జూబ్లిహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో.. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాంరాజన్ భేటీ జరిగింది. ఆ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు.

Updated : 17 Dec 2023 3:55 PM IST
Tags:    
Next Story
Share it
Top