Home > తెలంగాణ > కేంద్ర మంత్రివి.. రోడ్డుపై బైఠాయించడం అవసరమా? : తలసాని

కేంద్ర మంత్రివి.. రోడ్డుపై బైఠాయించడం అవసరమా? : తలసాని

కేంద్ర మంత్రివి.. రోడ్డుపై బైఠాయించడం అవసరమా? : తలసాని
X

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించేందుకు ‘ఛలో బాట సింగారం’ బాట పట్టిన బీజేపీ నేతలను అడ్డుకున్నారు. దీంతో శంషాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎయిర్ పోర్ట్ పరిది దాటడంతోనే కిషన్ రెడ్డి కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో కిషన్ రెడ్డి, రఘునందన్ రావుతో కలిసి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఈ విషయం పై స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. కిషన్ రెడ్డి తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై బీజేపీ నేతలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని తలసాని ఫైర్ అయ్యారు. ఓ కేంద్ర మంత్రిగా రోడ్డుపై బైఠాయించడం అవసరమా అని ఆయన ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు చూడ్డానికి కిషన్ రెడ్డి వస్తానంటే.. తానే స్వయంగా దగ్గరుండి చూపిస్తానని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిక అడ్డు పడుతుందని, ప్రజలపై వివక్ష చూపుతోంది అనడానికి ఇదే నిదర్శనమని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ఇప్పటివరకు ఇస్తానని చెప్పిన డబ్బులు ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. చాలా సందర్భాల్లో డబుల్ బెడ్ రూంలు చాలా బాగున్నాయని అన్న కిషన్ రెడ్డి.. ఇప్పుడెందుకు మాట మార్చుతున్నారో తనకు అర్థం కావట్లేదని అన్నారు. రాజకీయ డ్రామా అపాలని, ప్రజల పక్షాన నిలబడాలని కిషన్ రెడ్డిని కోరారు.

Updated : 20 July 2023 5:36 PM IST
Tags:    
Next Story
Share it
Top