కులవృత్తులకు ప్రభుత్వ అండ: తలసాని
X
బీసీ కులవృత్తి దారులకు అందించే లక్ష రూపాయల ఆర్థిక సాయం చెక్కులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పంపిణీ చేశారు. మంగళవారం (ఆగస్ట్ 29) బేగంబజార్ లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తో కలిసి పాల్గొన్న ఆయన.. ఆ నియోజక వర్గ పరిధిలోని 273 మంది బీసీ కులవృత్తి దారులకు చెక్కులు అందించారు. రాష్ట్ర ప్రజలకు ఆర్థిక అండగా నిలబడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతీ ఒక్కరికి అందజేస్తామని తలసాని తెలిపారు.
కులవృత్తిదారులను మరింత అభివృద్ధి పంథంలో నడిపించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. అందుకే దరఖాస్తు చేసుకున్న వాళ్లలో అర్హులైన అందరికీ రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఈ పథకం ద్వారా ఒక్కో నియోజక వర్గంలోని 300 మందిని ఎంపిక చేసి దశల వారీగ ఇవ్వనున్నట్లు తెలిపారు.