కొడంగల్లో రేవంత్.. హుజూరాబాద్లో ఈటల ఓటమి ఖాయం - తలసాని
X
టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తమ గురించి తాము ఎక్కువగా ఊహించుకుంటున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కొడంగల్లో రేవంత్.. హుజూరాబాద్లో ఈటల ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. సీఎంపై పోటీ చేసి ఓడిపోయామని హైకమాండ్కు చెప్పుకునేందుకే ఆ స్థానాల నుంచి బరిలో దిగుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ను ప్రజలు నమ్మరని తలసాని అన్నారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ప్రచారానికి వచ్చి అభాసుపాలయ్యారని సటైర్ వేశారు.
గ్రేటర్ పరిధిలో ఇప్పటి వరకు 70వేల డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చామని, రానివారికి మళ్లీ అధికారంలోకి రాగానే ఇస్తామని తలసాని స్పష్టం చేశారు. తాము గాలిమాటలు చెప్పమని, తనపై నమ్మకంతో ఉండాలని కోరారు. రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. త్వరలోనే బీఆర్ఎస్ ప్రచార జోరు మరింత పెంచుతామన్న తలసాని. గ్రేటర్‌లో 17నుంచి కేటీఆర్ రోడ్ షోలు స్టార్ట్ అవుతాయని అన్నారు. 25న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉంటుందని చెప్పారు.