చంద్రబాబు అరెస్టుపై స్పందించిన తలసాని..
X
స్కిల్ స్కాం కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అరెస్టుపై బీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ఆయనను అరెస్ట్ చేయడం బాధాకరమని అన్నారు. జగన్మోహన్ రెడ్డి సర్కారు తీరును తప్పుబట్టారు. రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేసిన వ్యక్తిని ఇబ్బందులకు గురిచేయడం సరికాదంటూ తలసాని ట్వీట్ చేశారు.
"ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడి గారి నాయకత్వంలో మంత్రిగా పని చేశాను... వారి అరెస్ట్ వ్యక్తిగతంగా నాకెంతో బాధను కలగచేసింది. అధికారం శాశ్వతం కాదు... ఒకప్పుడు కేంద్ర రాజకీయాలలో కీలకపాత్ర పోషించిన సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడి గారి పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విచారకరం. సుమారు 73 సంవత్సరాల వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం, విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేయడం సరికాదు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు." అని మంత్రి తలసాని ట్వీట్లో రాశారు. అయితే చంద్రబాబు అరెస్టైన 26 రోజుల తర్వాత మంత్రి స్పందించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
మాజీ ముఖ్యమంత్రి, TDP అధినేత @ncbn గారి అరెస్ట్ చాలా బాధాకరం.
— Talasani Srinivas Yadav (@YadavTalasani) October 4, 2023
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడి గారి నాయకత్వంలో మంత్రిగా పని చేశాను... వారి అరెస్ట్ వ్యక్తిగతంగా నాకెంతో బాధను కలగచేసింది.
అధికారం శాశ్వతం కాదు....ఒకప్పుడు కేంద్ర రాజకీయాలలో కీలకపాత్ర పోషించిన సీనియర్ నాయకులు…