Home > తెలంగాణ > Minister Tummala: మల్కాజ్‌గిరిలో గెలుపు కాంగ్రెస్‌దే.. మంత్రి తుమ్మల

Minister Tummala: మల్కాజ్‌గిరిలో గెలుపు కాంగ్రెస్‌దే.. మంత్రి తుమ్మల

Minister Tummala: మల్కాజ్‌గిరిలో గెలుపు కాంగ్రెస్‌దే.. మంత్రి తుమ్మల
X

సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్‌ విరిసిన చాలెంజ్‌పై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పందించారు. తండ్రీకొడుకులు ఎవరొచ్చినా మల్కాజ్ గిరి పార్లమెంట్ లో మా కార్యకర్తను నిలబెట్టి ఒడిస్తామని సవాల్ విసిరారు. గురువారం హైదరాబాద్ లోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి తుమ్మల ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ వచ్చినా.. వాళ్ళ నాయన కేసీఆర్ వచ్చినా మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గంలో గెలుపు కాంగ్రెస్ దేనన్నారు. తెలంగాణలో 17 ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నీళ్లు నిధులు నియమాకాల పేరుతో ఏర్పడిన తెలంగాణను బీఆర్ఎస్ పార్టీ.. అప్పుల పాలు చేసిందని అన్నారు.

గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూ.. ప్రతి నెల మొదటి రోజు ఉద్యోగులకు జీతాలు ఇచ్చేలా, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళుతుందని ఆయన చెప్పారు. అహంకారం, అవినీతి, అక్రమాలతో అన్ని రంగాల్లో తెలంగాణను టిఆర్ఎస్ పార్టీ ధ్వంసం చేసిందని ఫైర్ అయ్యారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ సీటు కాంగ్రెస్ పార్టీ గెలవడం దేశ రాజకీయాల్లో మలుపుకు కారణం అవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం సీఎం రేవంత్ రెడ్డి 18 గంటలు కష్టపడుతున్నారని తెలిపారాయన. ఎన్నికల హామీల్లో భాగంగా ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే నాలుగు అమలు చేశామని మిగిలిన రెండు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు.

Updated : 29 Feb 2024 9:54 PM IST
Tags:    
Next Story
Share it
Top