Home > తెలంగాణ > Uttam : బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు అన్యాయం జరిగింది.. మంత్రి ఉత్తమ్

Uttam : బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు అన్యాయం జరిగింది.. మంత్రి ఉత్తమ్

Uttam  : బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు అన్యాయం జరిగింది.. మంత్రి ఉత్తమ్
X

తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ పై చర్చ జరిగింది. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కృష్ణా నీళ్లు తెలంగాణకు ప్రధాన జీవనాధరమని తెలిపారు. నీటివాటాలు కాపాడడంలో బీఆర్ఎస్ సర్కార్ విఫలమైందన్నారు. కేఆర్ఎంబీకి ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టులు అప్పగించమని స్పష్టం చేశారు. 299 టీఎంసీలు తెలంగాణ వాటాగా బీఆర్ఎస్ సర్కార్ ఒప్పుకుందని చెప్పారు. నాగార్జున సాగర్ పై ఏపీ పోలీసులను ఉపసంహరించుకోవాలని సూచించారు. నీటి వాటా విషయంలో అప్పటి కేసీఆర్ సర్కార్ కేంద్రం ముందు తన వాదానను బలంగా వినిపించలేదని చెప్పుకొచ్చారు. కృష్ణా జలాల విషయంలో కొంత మంది అపోహలు సృష్టిస్తున్నారని అన్నారు. గత పాలకుల వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని మండిపడ్డారు.

బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు నీళ్ల వాటాల్లో న్యాయం జరగలేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో గత ప్రభుత్వం విఫలమైందని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే, తెలంగాణ వచ్చాకే నీళ్ల విషయంలో ఎక్కువ అన్యాయం జరిగిందని ఎద్దేవా చేశారు. కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక 50 శాతం ఎక్కువ నీళ్లను ఆంధ్రా వాళ్లు తీసుకెళ్లారని గుర్తు చేశారు.

జగన్ కు 203 జీవో ఇచ్చి పోతిపాడు సామర్థ్యం పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు రంగారెడ్డి లెక్కలు చెబితే ఆశ్చర్యపోతారని చెప్పారు. నీళ్ల విషయంలో రాష్ట్రానికి చేసిందంతా చేసి నల్గొండలో సభ పెట్టి ఏం లాభమని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటుకు అర్థం లేకుండా పోయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.




Updated : 12 Feb 2024 6:54 AM GMT
Tags:    
Next Story
Share it
Top