Home > తెలంగాణ > ప్రాజెక్ట్ ఎవరు కట్టారో వారే బాధ్యత వహించాలి.. మంత్రి ఉత్తమ్

ప్రాజెక్ట్ ఎవరు కట్టారో వారే బాధ్యత వహించాలి.. మంత్రి ఉత్తమ్

ప్రాజెక్ట్ ఎవరు కట్టారో వారే బాధ్యత వహించాలి.. మంత్రి ఉత్తమ్
X

మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందన్నారు. అక్టోబర్ 21న మేడిగడ్డ పిల్లర్ కుంగిందని.. అయినా అప్పటి సీఎం కేసీఆర్ ఈ అంశంపై ఒక్కసారి కూడా మాట్లాడలేదన్నారు. మూడేళ్లలోనే ప్రాజెక్టు కుంగడం సిగ్గు చేటన్నారు. అన్ని విషయాలను త్వరలోనే నిర్ధారణ చేస్తామన్నారు. మేడిగడ్డపై నిజనిజాలు మీడియాకు వెల్లడిస్తామన్నారు. ఎవరు కట్టారో వారే కుంగిన పిల్లర్లపై బాధ్యత వహించాలన్నారు.

మంత్రి ఉత్తమ్‌‌‌‌ కుమార్‌‌‌‌రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్‌‌‌‌ బాబు, పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌‌, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌‌‌‌ వెంకటస్వామి, ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌రెడ్డిలు ఇప్పటికే మేడిగడ్డ చేరుకున్నారు. ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం.. మంత్రులకు అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. ఇదిలా ఉండగా.. మేడిగడ్డ కుంగిన ప్రాంతానికి ఇరిగేషన్ అధికారులు ఎవరినీ అనుమతించడంలేదు. మేడిగడ్డ రెండు వైపుల బ్యారేజీని ఇరిగేషన్ అధికారులు మూసేశారు.ఇటీవల మంత్రులు కుంగిన ప్రాంతాన్ని చూపిస్తామని చెప్పారు. అయితే, అధికారులు మాత్రం ఎవ్వరినీ బ్యారేజీ వద్దకు అనుమతించడం లేదు.

Updated : 29 Dec 2023 1:55 PM IST
Tags:    
Next Story
Share it
Top