జాతీయ హోదాతో పాటు 60 శాతం వ్యయాన్ని భరించాలి : ఉత్తమ్
X
పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఇవాళ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో సీఎం రేవంత్, ఉత్తమ్ సమావేశమయ్యారు. 90 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ప్రాజెక్టు రూపకల్పన చేశామని ఉత్తమ్ తెలిపారు. పాలమూరు - రంగారెడ్డితో 12 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు 1200 గ్రామాలకు మంచినీరు ఇవ్వొచ్చని చెప్పారు. ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తూ 60 శాతం వ్యయం భరించాలని కేంద్రాన్ని కోరినట్లు ఉత్తమ్ తెలిపారు.
ప్రస్తుతం ఏ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వడం లేదని కేంద్రమంత్రి చెప్పారని ఉత్తమ్ తెలిపారు. అయితే ఇతర పథకాల కింద 60 శాతం నిధులు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. అదేవిధంగా శుక్రవారం యూపీఎస్సీ చైర్మన్ను కలుస్తామని చెప్పారు. యూపీఎస్సీ తరహాలోనే టీఎస్పీఎస్సీని రూపొందిస్తామని చెప్పారు. ఉద్యోగాల విషయంలో బీఆర్ఎస్ చేసిన తప్పులను తాము చేయబోమని స్పష్టం చేశారు.