Home > తెలంగాణ > పౌర సరఫరాల శాఖ ఆర్థిక స్థితి ఆందోళన కలిగిస్తోంది - మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

పౌర సరఫరాల శాఖ ఆర్థిక స్థితి ఆందోళన కలిగిస్తోంది - మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

పౌర సరఫరాల శాఖ ఆర్థిక స్థితి ఆందోళన కలిగిస్తోంది - మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
X

పౌర సరఫరాల శాఖ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆ శాఖలో తప్పిదాలు జరిగాయని అన్నారు. 12 శాతం వినియోగదారులు రేషన్‌కార్డులు ఉపయోగించలేదని ఉత్తమ్ స్పష్టం చేశారు. పేదలకు నాణ్యమైన రేషన్ బియ్యం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రేషన్ బియ్యాన్ని కొందరు పక్కదారి పట్టిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అంతకు ముందు పౌరసరఫరాల శాఖ పనితీరుపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. యాసంగి, వర్షాకాలంలో ధాన్యం ఉత్పత్తిపై అధికారులతో చర్చించారు. మిల్లింగ్ సామర్థ్యం, బియ్యం నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపైనా మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆరా తీశారు.

Updated : 12 Dec 2023 12:42 PM IST
Tags:    
Next Story
Share it
Top