Ministers Meeting : రేపు మిర్యాలగూడకు మంత్రులు భట్టి, ఉత్తమ్..షెడ్యూల్ ఇదే
X
మంత్రులు భట్టి విక్కమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు మిర్యాలగూడలో పర్యటించనున్నారు. ముందుగా రేపు ఉదయం వారు బేగంపేట నుంచి హెలికాప్టర్ లో బయలు దేరి.. మిర్యాలగూడలోని యాదాద్రి పవర్ ప్లాంట్ ను సందర్శించినున్నారు. ఆ తర్వాత హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని మేళ్లచెరువు మైహోమ్ ఫ్యాక్టరీని పరిశీలించనున్నారు. అక్కడి నుంచి చింతలపాలెం మండలం నక్కగూడెం చేరుకుంటారు. నక్కగూడెం గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు.
శంకుస్థాపన అనంతరం నక్కగూడెం నుంచి దొండపాడు గ్రామానికి వెళ్లనున్నారు. అక్కడ 400 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మిస్తున్న ఇన్నోవెరా ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపన అనంతరం జువారీ సిమెంట్ ఫ్యాక్టరీలో కార్యకర్తలతో పాటు భోజనం చేస్తారు. భోజనం అనంతరం మంత్రులిద్దరూ మేళ్లచెరువు మై హోమ్ కు బయలుదేరి తిరిగి హైదరాబాద్ చేరుకొనున్నారు.
పూర్తి షెడ్యూల్ ఇదే..
ఉ. 09.00 గంటలకు - బేగంపేట నుండి హెలికాప్టర్ లో బయలుదేరుతారు
ఉ. 09.45 గంటలకు మిర్యాలగూడలోని యాదాద్రి పవర్ ప్లాంట్‌లో ల్యాండింగ్ అవుతారు.
ఉ. 09.45 గంటల నుండి 11.15 గంటల వరకు - యాదాద్రి పవర్ ప్లాంట్ సందర్శన
ఉ. 11.15 గంటలకు యాదాద్రి పవర్ ప్లాంట్ నుండి బయలుదేరుతారు
ఉ. 11.45 గంటలకు హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని మేళ్లచెరువు మైహోమ్ ఫ్యాక్టరీలో ల్యాండింగ్ అవుతారు. అక్కడి నుండి చింతలపాలెం మండలం నక్కగూడెం చేరుకుంటారు.
మ. 12.00 గంటల నుండి 12.45 గంటల వరకు - నక్కగూడెం గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి శంకుస్థాపన
మ. 12.45 గంటలకు నక్కగూడెం నుండి దొండపాడు గ్రామానికి బయలు దేరుతారు.
మ. 01.00 గంటల నుండి 02.00 గంటల వరకు - 400 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మిస్తున్న ఇన్నోవెరా ఫ్యాక్టరీకి శంకుస్థాపన
మ. 02.00 గంటల నుండి 2.30 గంటల వరకు - జువారీ సిమెంట్ ఫ్యాక్టరీలో భోజనం చేస్తారు.
మ. 02.30 గంటలకు - మేళ్లచెరువు మై హోమ్ కు బయలుదేరుతారు.
మ. 02.45 గంటలకు - మేళ్లచెరువు మై హోమ్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరుతారు.
మ. 03.30 గంటలకు - బేగంపేటకు చేరుకుంటారు.