Home > తెలంగాణ > TS Elections 2023: నాగం జనార్థన్ రెడ్డి ఇంటికి కేటీఆర్, హరీష్ రావు.. బీఆర్ఎస్లోకి ఆహ్వానం..

TS Elections 2023: నాగం జనార్థన్ రెడ్డి ఇంటికి కేటీఆర్, హరీష్ రావు.. బీఆర్ఎస్లోకి ఆహ్వానం..

TS Elections 2023: నాగం జనార్థన్ రెడ్డి ఇంటికి కేటీఆర్, హరీష్ రావు.. బీఆర్ఎస్లోకి ఆహ్వానం..
X

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్‌ నేత నాగం జనార్దన్‌రెడ్డికి బీఆర్ఎస్ ఆహ్వానం అందింది. ఆదివారం సాయంత్రం మంత్రులు కేటీఆర్‌, హరీష్ రావు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నాగం జనార్దన్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయనను కలిసి బీఆర్ఎస్ లోకి రావాలని ఆహ్వానించగా.. నాగం అందుకు అంగీకరించారు. నాగం జనార్థన్ రెడ్డితో భేటీ అనంతరం మంత్రి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచన మేరకు నాగంను బీఆర్ఎస్ లోకి రావాలని కోరినట్లు చెప్పారు. ఆయనతో పాటు ఆయన అనుచరులకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పడంతో ఆయన తమ ఆహ్వానాన్ని మన్నించారని అన్నారు. సీఎం కేసీఆర్‌, నాగం జనార్థన్ రెడ్డిది 40 ఏండ్ల స్నేహమని, పుట్టు తెలంగాణవాది అయిన ఆయనతో కలిసి ఎన్నికల్లో పనిచేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

మరోవైపు బీఆర్ఎస్ లోకి రావాలని కేటీఆర్, హరీష్ రావు ఆహ్వానించారని, త్వరలోనే గులాబీ కండువా కప్పుకుంటానని నాగం జనార్థన్ రెడ్డి ప్రకటించారు. నాగర్ కర్నూల్‌ భవిష్యత్‌ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. నాగర్ కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డితో కలిసి పనిచేస్తానని అన్నారు. కార్యకర్తల కోరిక మేరకే అధ్వాన్న స్థితికి చేరిన కాంగ్రెస్ కు రాజీనామా చేశానని అన్నారు. ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ను కాంగ్రెస్‌ తుంగలో తొక్కిందని, తనకు టికెట్‌ ఎందుకు రాలేదని రేవంత్‌ రెడ్డిని ప్రశ్నిస్తే.. సునీల్‌ కనుగోలు టీం సర్వే ఆధారంగా టికెట్‌ ఇచ్చామని చెప్పారని నాగం అన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా డబ్బులు ఉన్నవారికే టికెట్‌ ఇస్తున్నారని ఆరోపించారు.

Updated : 29 Oct 2023 8:03 PM IST
Tags:    
Next Story
Share it
Top