Home > తెలంగాణ > Ponnam Prabhakar : మేడారం జాతర కోసం 6వేల ఆర్టీసీ బస్సులు

Ponnam Prabhakar : మేడారం జాతర కోసం 6వేల ఆర్టీసీ బస్సులు

Ponnam Prabhakar  : మేడారం జాతర కోసం 6వేల ఆర్టీసీ బస్సులు
X

తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. ఈ నెల 21 నుంచి మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రారంభంకానున్న నేపథ్యంలో మరో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకున్నారు. అనంతరం జాతర ఏర్పాట్లను పరిశీలించారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా జాతరను వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. రూ.105 కోట్ల నిధులతో జాతర పనులు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.

వనదేవతల అనుగ్రహంతోనే పరాయి పాలన నుంచి విముక్తి లభించి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సమ్మక్క తల్లిని చిలకల గుట్ట నుంచి గద్దెల మీదకు తీసుకొచ్చే సమయంలోనే పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఆ తల్లుల ఆశీర్వాదంతోనే తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిందని అన్నారు. జాతరకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా 6 వేల బస్సులు అదుబాటులోకి ఉంచుతామన్నారు. ఇందుకోసం ఆర్టీసీకి రూ.2.25కోట్ల నిధులు మంజూరు చేశామని చెప్పారు. తెలంగాణలోని మహిళలకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత ప్రయాణం చేయొచ్చని పొన్నం స్పష్టం చేశారు.

అంతకు ముందు మేడారంకు వెళ్లే దారిలో మంత్రులు పొన్నం, సీతక్క మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. జాతరలో రవాణా సదుపాయాల సమీక్ష కోసం ఒకే వాహనంలో హైదరాబాద్ నుంచి మేడారం వెళ్తూ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘అన్నా.. ఎప్పుడైనా మేడారం జాతరకు వచ్చారా?’ అని సీతక్క ప్రశ్నించగా.. పొన్నం ప్రభాకర్‌ తన అనుభవాలు, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.




Updated : 5 Feb 2024 1:19 PM GMT
Tags:    
Next Story
Share it
Top