Home > తెలంగాణ > బీఆర్ఎస్ వైఖరీతో సివిల్ సప్లై శాఖపై భయంకర భారం : మంత్రులు

బీఆర్ఎస్ వైఖరీతో సివిల్ సప్లై శాఖపై భయంకర భారం : మంత్రులు

బీఆర్ఎస్ వైఖరీతో సివిల్ సప్లై శాఖపై భయంకర భారం : మంత్రులు
X

ధనిక రాష్ట్రమైన తెలంగాణ బీఆర్ఎస్ పాలనతో ఆగమైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ వైఖరితో సివిల్ సప్లై శాఖపై రూ.58,860 కోట్ల భారం పడిందని ఆరోపించారు. సచివాలయంలో పౌర సరఫరాల శాఖ బడ్జెట్‌ ప్రతిపాదనలపై మంత్రులు సమీక్షించారు. సివిల్ సప్లై శాఖపై కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని ఫైర్ అయ్యారు. 2014 - 2015లో రూ.383 కోట్ల బకాయిలు ఉంటే.. ఇప్పుడు 14వేల కోట్లకు చేరిందన్నారు.

2016 నుంచి సివిల్ సప్లై శాఖపై వేల కోట్ల భారం పడుతూ వచ్చిందని మంత్రులు ఆరోపించారు. గతంలో సివిల్ సప్లై అధికారులు రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి వెంటనే డబ్బులు చెల్లించేవారని తెలిపారు. బ్యాంకుల నుంచి రూ.58,860 వేల కోట్ల రుణాలు తీసుకున్నారని.. పాత బకాయిలు చెల్లింపుల కోసం మళ్లీ అప్పులు చేశారని వివరించారు. బ్యాంకు గ్యారెంటీ ఇస్తే తప్ప రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ఏదిఏమైనా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైన ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.





Updated : 20 Jan 2024 1:46 PM GMT
Tags:    
Next Story
Share it
Top