రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి : కోమటిరెడ్డి, ఉత్తమ్
X
రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని అధికారులను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి ఆదేశించారు. నల్గొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై వారు సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టులను స్పీడ్గా పూర్తిచేసేందుకు చేపట్టాల్సిన అంశాలపై అధికారులకు కీలక సూచనలు చేశారు. ఉదయసముద్రం బ్రహ్మణవెల్లముల లిఫ్ట్ ఇరిగేషన్ కాలువలతో పాటు పెండింగ్లో ఉన్న SLBC టన్నెల్ పనులను వెంటనే పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. గత కాంగ్రెస్ హయాంలోనే ఎస్ఎల్బీసీ కాలువలను పూర్తిచేసినప్పటికి బీఆర్ఎస్ సర్కార్ మెయింటెనెన్స్ కూడా చేయలేదని ఫైర్ అయ్యారు. ఉదయసముద్రం ప్రాజెక్టుకు రూ.200 కోట్లను త్వరగా విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులకు కేసీఆర్ సర్కార్ తీరని అన్యాయం చేసిందని కోమటిరెడ్డి ఆరోపించారు. SLBC ప్రాజెక్టు పనులు పూర్తైనా.. నిర్లక్ష్యంతో అలాగే వదిలేశారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టుపై గతంలోలో పలుసార్లు అసెంబ్లీలో మాట్లాడిన కేసీఆర్ స్పందించలేదని విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నల్గొండ సాగునీటి ప్రాజెక్టులను త్వరతగతిన పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్గా ఉండడం జిల్లావాసుల అదృష్టమన్నారు.