Home > తెలంగాణ > Medigadda Barrage:నేడు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్

Medigadda Barrage:నేడు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్

Medigadda Barrage:నేడు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
X

కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌పై కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. ఇందులో భాగంగా నలుగురు మంత్రుల బృందం నేడు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనుంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌‌‌‌ కుమార్‌‌‌‌రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్‌‌‌‌ బాబు, పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌‌, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌‌‌‌ వెంకటస్వామి, ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌రెడ్డి హైదరాబాద్‌‌‌‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌‌‌‌లో మేడిగడ్డకు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో మేడిగడ్డ దగ్గర ఇరిగేషన్‌‌‌‌ శాఖ, ఎల్‌‌‌‌ అండ్‌‌‌‌ టీ కంపెనీ ఏర్పాట్లు చేశాయి. హెలీప్యాడ్‌‌‌‌ను సిద్ధం చేశారు. మహాదేవపూర్ మండలంలోని అంబటిపల్లి వద్ద ఎల్అండ్ టీ క్యాంప్ ఆఫీసులో పవర్ పాయింట్‌‌‌‌ ప్రజెంటేషన్‌‌‌‌కు ఏర్పాట్లు చేశారు. ఈ పర్యటన కు సంబంధించి నిర్మాణ సంస్థలకు సబ్ కాంట్రాక్టర్లలకు, ఈ నిర్మాణంలో సంబంధం ఉన్న వారికి అందరికీ సమాచారం ఇచ్చి సమావేశంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలపి ఈ.ఎన్.సిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.

రీడిజైనింగ్ ద్వారా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరంగా మార్చడం, దాని వల్ల కలిగిన లాభనష్టాలు, మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటు, అన్నారం బ్యారేజీ వద్ద సమస్యలు సహా అన్ని అంశాలపై మంత్రులు దృష్టి సారించనున్నారు. మంత్రుల బృందం ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్‌‌‌‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌‌‌‌లో బయల్దేరి 11:30 గంటలకు మేడిగడ్డకు చేరుకుంటుంది. ఆ తర్వాత అక్కడే గంటన్నర పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌పై పవర్‌‌‌‌ పాయింట్‌‌‌‌ ప్రజెంటేషన్‌‌‌‌ ఉంటుంది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నష్టంపై మంత్రులు సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజీని పరిశీలిస్తారు. 2 నుంచి 3గంటల నుంచి భోజన విరామం, ఆ తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు తెలిసింది. మధ్యాహ్నం 3:20 గంటలకు అన్నారం బ్యారేజీ వద్దకు చేరుకొని, బ్యారేజీలో ఏర్పడిన బుంగలను పరిశీలించనున్నారు. 4:30 గంటలకు తిరిగి హెలికాప్టర్‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌కు వెళ్తారు.

Updated : 29 Dec 2023 7:31 AM IST
Tags:    
Next Story
Share it
Top