Home > తెలంగాణ > హైదరాబాద్ ESIలో దారుణం.. లిఫ్ట్‌లో యువతిని బంధించి..

హైదరాబాద్ ESIలో దారుణం.. లిఫ్ట్‌లో యువతిని బంధించి..

హైదరాబాద్ ESIలో దారుణం.. లిఫ్ట్‌లో యువతిని బంధించి..
X

ఆడవారిపై అఘాయిత్యాలకు సంబంధించి ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. ఎన్ని చర్యలు చేపట్టినా అత్యాచారాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూలన అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ సనత్ నగర్‌లోని ఈఎస్‌ఐ ఆస్పత్రిలో ఓ కామాంధుడు మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. నోట్లో గుడ్డలు కుక్కి ఆసుపత్రిలో లిఫ్ట్ లో ఈ దారుణానికి తెగబడ్డాడు. ఈఎస్ఐ ఆస్పత్రి ఓపీడీలోని రెండో అంతస్తులో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక కుటుంబం వైద్యం కోసం ఈఎస్ఐ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. వారం రోజుల నుండి ఈఎస్ఐ ఆసుపత్రిలో బాధిత బాలిక (13) అన్నయ్య చికిత్స తీసుకుంటున్నాడు.

శుక్రవారం రాత్రి తన అన్నయ్యకి ఆహారం తీసుకురావడానికి ఆరో అంతస్తు నుంచి బాలిక కిందికి వచ్చింది. తిరిగి వెళ్లబోతుంటే ఆసుపత్రి సెక్యూరిటీ గార్డు ఆమెకు తారసపడి అక్కడి క్యాంటీన్‌లో పనిచేసే షాదాబ్‌(25)ను పరిచయం చేశాడు. ఏదైనా సాయం కావాలంటే అతడ్ని సంప్రదించాలని సూచించాడు. ఆమె తిరిగి లిఫ్ట్‌లో వెళ్తుంటే షాదాబ్‌ అనుసరించి బలవంతంగా రెండో అంతస్తులోని చీకటి ప్రదేశంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం రక్త పరీక్షలు చేసే గదిలో మరోసారి అత్యాచారం చేశాడు. యువతి సోదరుడికి ఫోన్‌ చేయగా.. అతను రెండో అంతస్తుకు చేరుకొని గట్టిగా కేకలు వేశాడు. దీంతో నిందితుడు పారిపోయాడు. ఆసుపత్రి అధికారులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. నిందితుడు షాదాబ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.

Updated : 17 Sept 2023 11:08 AM IST
Tags:    
Next Story
Share it
Top