Home > తెలంగాణ > ఐటీ దాడుల వెనుక కొందరి కుట్ర.. నల్లమోతు భాస్కర్ రావు

ఐటీ దాడుల వెనుక కొందరి కుట్ర.. నల్లమోతు భాస్కర్ రావు

ఐటీ దాడుల వెనుక కొందరి కుట్ర.. నల్లమోతు భాస్కర్ రావు
X

నల్గొండ జిల్లాలోని బీఆర్ఎస్ అభ్యర్థుల అనుచరుల ఇండ్లలో ఐటీసోదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావుతో పాటు ముఖ్య అనుచరుల ఇండ్లలో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు ఐటి అధికారులు. 40 చోట్ల 30 టీమ్ లతో ఈ ఏకకాలంలో ఈ రైయిడ్స్ నిర్వహిస్తున్నారు.. కాగా ఐటీ దాడులపై మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు స్పందించారు. తన బంధువులు, అనుచరుల ఇళ్లలో ఐటీ సోదాలు జరగలేదన్నారు. ఐటీ అధికారులు ఎవరూ తనను కలవలేదన్నారు. రైస్ మిల్లులపైనే దాడులు జరుగుతున్నాయన్నారు. రైస్ మిల్లర్లకు, తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రైస్ మిల్లర్లతో తనకు ఎలాంటి లావాదేవీలు లేవన్నారు. కుట్రలో భాగంగానే తనపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ఎన్నికల్లో గెలవలేక ఇలాంటి కుట్రలు చేస్తున్నారని భాస్కర్ రావు ఫైర్ అయ్యారు. తనకు ఎలాంటి కంపెనీలు లేవన్నారు. తన దగ్గర డబ్బులు లేవని.. ఎక్కడైనా ఉంటే చూపిస్తే మీకే ఇచ్చేస్తా అన్నారు. ఇక, భాస్కర్ రావు వేముల పల్లిలో ఎన్నికల ప్రచారం‌లో పాల్గొన్నారు.

ఇటీవలే తెలంగాణలో ఎన్నికల సందర్బంగా ఐటీ అధికారులు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచరుల ఇళ్లపై కూడా ఇటీవల ఐటీ అధికారులు దాడులు చేశారు. ఈ సోదాల్లో సబితా అనుచరులుగా ప్రచారం జరుగుతున్న నరేందర్ రెడ్డి ఇంట్లో 7.50 కోట్లు, ప్రదీప్ రెడ్డి ఇంట్లో రూ.5 కోట్లకు పైగా డబ్బును ఐటీ అధికారులు సీజ్ చేశారు. ఈ నగదును మహేశ్వరం ఎన్నికల కోసం సమకూర్చుకున్నదిగా ప్రచారం జరుగుతోంది. ప్రదీప్ రెడ్డి, నరేందర్ రెడ్డికి మంత్రి సబితా కుమారుడితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా ఐటీ అధికారులు విచారణలో గుర్తించారు. అటు, పొంగులేటి ఇంట్లో కూడా ఐటీ దాడులు జరిగాయి. ''

Updated : 16 Nov 2023 6:51 AM GMT
Tags:    
Next Story
Share it
Top