మిషన్ చాణక్య సర్వే.. ఆ పార్టీకే స్పష్టమైన మెజార్టీ
X
తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయమని సర్వే రిపోర్టులు చెబుతున్నాయి. తాజాగా మిషన్ చాణక్య సర్వేలోనూ ఇదే విషయం స్పష్టమైంది. నా రాష్ట్రం- నా ఓటు – నా నిర్ణయం నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో మెజార్టీ ప్రజలు బీఆర్ఎస్‌వైపే మొగ్గుచూపినట్లు వెల్లడైంది. అన్ని వయసుల ఓటర్లలోనూ అధిక శాతం మంది బీఆర్‌ఎస్‌కే తమ ఓటు అని స్పష్టం చేసినట్లు మిషన్ చాణక్య సర్వేను బట్టి తెలుస్తోంది.
నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 44.62 శాతం ఓట్లు వస్తాయని మిషన్ చాణక్య సర్వేలో తేలింది. కాంగ్రెస్ 32.71 శాతానికే పరిమితమవుతుందని చెప్పింది. బీజేపీకి కేవలం 17.6 శాతం ఓట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని సర్వే స్పష్టం చేసింది. గత 4 నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా అధ్యయం చేసి.. 14 లక్షల మంది అభిప్రాయాలు సేకరించిన అనంతరం ఈ డేటాను వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ కనీసం 76 స్థానాల్లో గెలుస్తుందని ఈ సర్వేలో వెల్లడైంది.
ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిపై 85 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు మిషన్ చాణక్య సర్వేలో తేలింది. ముఖ్యంగా బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటన తర్వాత మహిళా ఓటర్ల నుంచి ఆ పార్టీకి భారీగా సానుకూల స్పందన వచ్చినట్లు సర్వే చెబుతోంది.
తెలంగాణ ఎన్నికలపై మిషన్ చాణక్య సర్వే ఫలితాలు వెల్లడి
— Telugu Scribe (@TeluguScribe) October 22, 2023
బీఆర్ఎస్ - 44.62%
కాంగ్రెస్ - 32.71%
బీజేపీ - 17.6%#MissionChanakyaSurvey #TelanganaElections #TelanganaElection2023 pic.twitter.com/SFMlTMlEYZ