Home > తెలంగాణ > అనర్హత నుంచి ఎమ్మెల్యే దానం తప్పించుకోలేరు..వినోద్ కుమార్ కామెంట్స్

అనర్హత నుంచి ఎమ్మెల్యే దానం తప్పించుకోలేరు..వినోద్ కుమార్ కామెంట్స్

అనర్హత నుంచి ఎమ్మెల్యే దానం తప్పించుకోలేరు..వినోద్ కుమార్ కామెంట్స్
X

కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత నుంచి తప్పించుకోలేరని బీఆర్‌ఎస్ నేత వినోద్‌కుమార్ అన్నారు. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించొద్దని తెలిపారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా ఉద్యమకారులేనని ఆయన తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తాము కూల్చమని స్పష్టంగా చెప్పినప్పటికీ... వారికి వారే ఊహించుకుంటున్నారని విమర్శించారు.

ఓ పార్టీ నుంచి గెలిచిన వారు మరో పార్టీలోకి వెళ్లవద్దని... అలాచేసిన వారిని ఉరితీయాలని గతంలో ఇదే రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు. 'రేవంత్ రెడ్డి మీకు మంచిగానే ఉంది మెజార్టీ. అయిదేళ్లు పరిపాలన చేయండి. మీరు చూసుకోవాల్సింది ఏమంటే మీ పార్టీలో ఉన్నవాళ్లు వెళ్ళకుండా చూసుకోండి.' అని సూచించారు. ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వం లేకపోయేసరికి ప్రజలు ఎంతో బాధపడుతున్నారని.. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వెళ్లడం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఎమ్మెల్యేలను చేర్చుకోవడం బీఆర్ఎస్ చేసింది కాబట్టి మేం కూడా చేస్తామంటే ఎలా? అని వినోద్‌రావు నిలదీశారు.

Updated : 18 March 2024 3:57 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top