Home > తెలంగాణ > Etela Rajender : ఈటలకు రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జైన ఇంజిన్ భాగం

Etela Rajender : ఈటలకు రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జైన ఇంజిన్ భాగం

Etela Rajender : ఈటలకు రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జైన ఇంజిన్ భాగం
X

బీజేపీ కీలక నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ కి యాక్సిడెంట్ అయింది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా మానకొండూరు లలితాపూర్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుకు అడ్డంగా వస్తున్న గొర్రెల మందను తప్పించే క్రమంలో.. ఈటల కాన్వాయ్ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో ఆ కాన్వాయ్ వెనుక వస్తున్న కారు ఈటల వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఈటల సహా ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈటల కాన్వాయ్ వెనక భాగం దెబ్బతినగా.. ఢీకొన్న వాహనం ఇంజిన్ భాగం నుజ్జు నుజ్జయింది. దీంతో ఆయన మరో వాహనంలో హైదరాబాద్ కు వెళ్లిపోయారు.










Updated : 3 Sept 2023 9:57 PM IST
Tags:    
Next Story
Share it
Top