MLC Kavitha ED: అధికారులను మేనేజ్ చేసింది చాలు.. తప్పు ఒప్పుకుంటే సరి: ఈటల
X
ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితులుగా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లై, మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు ఈడీ విచారణలో అప్రూవర్ గా మారారు. 164 కింద ఈడీకి వాంగ్మూలం ఇచ్చారు. కాగా తాజాగా ఈడీ కవితకు నోటీసులు పంపించింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ నోటీసులపై బీజేపీ నేత, ఎమ్మెల్చే ఈటల రాజేందర్ స్పందించారు. చట్టం తన పని తాను చేసుకు పోతుందని, చట్టం ముందు అందరు సమానులేనని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు దోపిడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వాళ్లందరూ ఏదో ఒకరోజు జైలుకు వెళ్లడం కాయమని జోస్యం చెప్పారు. కవిత విషయంలో తాత్కాలికంగా మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని, అధికారులను తప్పదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. తప్పుచేసిన వారు ఎంతటి వారైనా శిక్ష తప్పక శిక్ష పడుతుందని తెలిపారు.
కొన్నాళ్ల క్రితం రామచంద్ర పిళ్లైకు సంబంధించిన పలు ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఎమ్మెల్సీ కవిత తరుపున పిళ్లై కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయన అప్రూవర్గా మారడం ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికే ఈ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సహా ఆయన తనయుడు మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి అప్రూవర్లుగా మారారు. సౌత్ గ్రూప్లో కీలకంగా వ్యవహరించిన వీరు ఇప్పుడు అప్రూవర్లుగా మారడం గమనార్హం. అప్రూవర్లు ఇచ్చిన సమాచారంతో ఈడీ పలువురిని ప్రశ్నిస్తోంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నగదు బదిలీ ఎలా జరిగింది..ఎవరు చేశారు.. ఎక్కడి నుంచి ఎక్కడకు పంపించారు..? కీలకంగా వ్యవహరించింది ఎవరు..? అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది.