రాష్ట్ర ప్రజలు బీజేపీని గెలిపించాలనుకుంటున్నారు - ఈటల రాజేందర్
X
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఈసారి అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. పార్టీ హెడ్ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఒకరిద్దరు నేతలు పార్టీ మారినంత మాత్రన వచ్చిన నష్టమేమీ లేదని అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్కు మళ్లీ అధికారం అప్పగించొద్దని ఫిక్స్ అయ్యారని ఈటల అభిప్రాయపడ్డారు. ఈసారి ఎన్నికల్లో ఓటర్లు బీఆర్ఎస్ పార్టీని బంగాళా ఖాతంలో కలపడం ఖాయమని అన్నారు
ఇక కాంగ్రెస్పైనా ఈటల విమర్శలు సంధించారు. ఆ పార్టీ గత చరిత్ర అంతా తెలంగాణ ప్రజల కళ్ల ముందు కదలాడుతోందని అన్నారు. ప్రజాక్షేత్రంలో ఆ పార్టీకి పలుకుబడి, విశ్వాసం లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా, బీఆర్ఎస్ కు ఓటు వేసినా ఒకటేనన్న విషయాన్ని ప్రజలు గ్రహించారని అందుకే బీజేపీని గెలిపించాలన్న భావన ప్రజల్లో పెరిగిందని ఈటల రాజేందర్ చెప్పారు.