Home > తెలంగాణ > కాంగ్రెస్ గెలవకపోతే ఉరేసుకుంటావా..? రేవంత్ రెడ్డికి జోగు రామన్న సవాల్

కాంగ్రెస్ గెలవకపోతే ఉరేసుకుంటావా..? రేవంత్ రెడ్డికి జోగు రామన్న సవాల్

కాంగ్రెస్ గెలవకపోతే ఉరేసుకుంటావా..? రేవంత్ రెడ్డికి జోగు రామన్న సవాల్
X

టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డిపై మాజీ మంత్రి, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న ఫైర్ అయ్యారు. సీఎం కావాలని కలలు కంటున్న రేవంత్‌.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తే తాను ఉరేసుకుంటున్నానని అన్నారు. ఒకవేళ అలా జరగకపోతే ఆయన ఆత్మహత్య చేసుకుంటారా అని సవాల్ విసిరారు. రేవంత్‌కు దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలని అన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్‌ రెడ్డి అని, ఆయన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నౌకర్‌ అని జోగు రామన్న ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే నైతిక హక్కు ఆయనకు లేదని అన్నారు.

ఇటీవల రేవంత్‌ రెడ్డి తనను, తన ఇంటి పేరును ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గానికి చెందిన ఎమ్మెల్యేనైనందునే ఓర్వలేక అవమానిస్తున్నాడని విమర్శించారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించే ప్రసక్తేలేదని హచ్చరించారు. రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకడలతో అందరూ విసిగిపోయారని జోగు రామన్న అన్నారు. కర్నాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే ఇక్కడి నేతలు సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని సటైర్ వేశారు. టీపీసీసీ అధ్యక్షుడికి గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎవరో తెలియక పోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

ఇటీవల ఆదిలాబాద్ పర్యటనలో ఎమ్మెల్యే జోగు రామన్నపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆయన జోగు రామన్న కాదని జోకుడు రామన్న అని ఎద్దేవా చేశారు. ఆయన చెల్లని రూపాయి లాంటి వాడైనందునే కేసీఆర్ రెండోసారి మంత్రి పదవి ఇవ్వలేదని అన్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే జోగు రామన్న ఫైర్ అయ్యారు.

Updated : 17 Jun 2023 2:10 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top