రైతుబంధు, పింఛన్లు ఫ్రీజ్.. బ్యాంకులపై ఎమ్మెల్యే ఫైర్
Mic Tv Desk | 12 July 2023 7:14 PM IST
X
X
రైతులకు సంబంధించిన రైతుబంధు, పెన్షన్లను బ్యాంకులు ఫ్రీజ్ చేయడంపై అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఫైర్ అయ్యారు. వట్పల్లిలోని ఏపీజీవీబీ బ్యాంకులో రైతుబంధు పెన్షన్ల డబ్బులు ఇవ్వడం లేదని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీంతో నేరుగా బ్యాంకుకు వెళ్లిన ఎమ్మెల్యే.. రైతుల సమస్యలపై బ్యాంకు సిబ్బందితో చర్చించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుబంధు, పెన్షన్లను ఆపొద్దని బ్యాంకు అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. లోను చెల్లించలేదని ప్రభుత్వ పథకాలను ఆపితే బ్యాంకుల ముందు ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. బ్యాంక్ సిబ్బంది పద్ధతి మార్చుకొని రైతులకు సహకరించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల డబ్బులు సకాలంలో రైతులకు అందేలా చూడాలని ఆర్డీవో, వ్యవసాయ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.
Updated : 12 July 2023 7:14 PM IST
Tags: andole mla mla kranthi kiran brs mla RYTHU BANDHU pensions farmers telangana cm kcr trending news today current trending topics Today Trending News in Telugu news telugu news telugu today breaking news in telugu Mic Tv Telugu news
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire