Home > తెలంగాణ > ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చింది 420 హామీలు: KTR

ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చింది 420 హామీలు: KTR

ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చింది 420 హామీలు: KTR
X

ఎమ్మెల్యే కేటీఆర్ అధికార కాంగ్రెస్ పార్టీపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినవి 420 హామీలని, నాలుగైదుసార్లు ఓడిపోయామనే సానుభూతితో ఎమ్మెల్యేలుగా గెలిచారని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బుధవారం (జనవరి 24) కరీంనగర్‌ జరిగినలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ల భేటీలో మాట్లాడిన కేటఆర్.. ఈ వాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదని.. మొత్తం 420 హామీలు ఇచ్చిందని అన్నారు. మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలన్ని అమలు చేయకపోతే బట్టలు విప్పి కాంగ్రెస్ నేతలను నడిరోడ్డుపై నిలబెడతామని కేటీఆర్ హెచ్చరించారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఏక్ నాథ్ షిండే అవ్వొచ్చని, మైనార్టీలంతా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. జేపీ-కాంగ్రెస్‌ ఒప్పందంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చాయని ఆరోపించారు.

పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వాయిదా వేయాలని చూస్తుందన్నారు. ఈ ఎన్నికలకు ముందే ఆరు గ్యారంటీలను అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ పై ఇప్పటికీ విశ్వాసంతో ఉన్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కచ్చితంగా మెజార్టీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాల్లో గెలవడం చిన్న విషయం కాదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కేసులకు ఎవరూ భయపడొద్దు, అధైర్య భయపడొద్దని బీఆర్ఎస్ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.

Updated : 24 Jan 2024 3:02 PM GMT
Tags:    
Next Story
Share it
Top