Home > తెలంగాణ > బీఆర్ఎస్ పదేండ్లలో రాష్ట్రాన్ని అప్పులమయం చేసింది - ఎమ్మెల్యే మదన్ మోహన్

బీఆర్ఎస్ పదేండ్లలో రాష్ట్రాన్ని అప్పులమయం చేసింది - ఎమ్మెల్యే మదన్ మోహన్

బీఆర్ఎస్ పదేండ్లలో రాష్ట్రాన్ని అప్పులమయం చేసింది - ఎమ్మెల్యే మదన్ మోహన్
X

పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులమయం చేసిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. గత ముఖ్యమంత్రి ధనిక రాష్ట్రం అని చెప్పారని కానీ అందులో ఏ మాత్రం నిజం లేదని అన్నారు. బీఆర్ఎస్ సర్కారు వైఖరి కారణంగా గ్రామాల్లో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ లేకుండా పోయిందని, అసలు తెలంగాణ ఎక్కడ నెంబర్ వన్ అయిందని ప్రశ్నించారు.

రాష్ట్రంలో 75 లక్షల కుటుంబాలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని మదన్ మెహన్ చెప్పారు. అన్ని రాష్ట్రాల మాదిరిగానే ఇక్కడ కూడా ఐటీ అభివృద్ధి జరిగిందే తప్ప ఇందుకోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా చేసిందేమీ లేదని అన్నారు. గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిన మంచి ఏమీ లేదని చెప్పారు. పేదల కోసమే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు తీసుకొచ్చిందన్న మదన్ మోహన్.. వాటిని కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.

Updated : 20 Dec 2023 3:09 PM IST
Tags:    
Next Story
Share it
Top