Home > తెలంగాణ > Mynampally Hanumanth Rao: ఖర్గే సమక్షంలో కాంగ్రెస్లో చేరిన మైనంపల్లి హనుమంతరావు

Mynampally Hanumanth Rao: ఖర్గే సమక్షంలో కాంగ్రెస్లో చేరిన మైనంపల్లి హనుమంతరావు

Mynampally Hanumanth Rao: ఖర్గే సమక్షంలో కాంగ్రెస్లో చేరిన మైనంపల్లి హనుమంతరావు
X

మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్లో చేరారు. (MLA Mynampally Hanumantha Rao) ఇటీవలే బీఆర్ఎస్కు రాజీనామా చేసిన ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. మైనంపల్లితో పాటు ఆయన కుమారుడు రోహిత్ కూడా హస్తం పార్టీలో జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మల్లిఖార్జున ఖర్గే ఛత్తీస్ఘడ్ టూర్లో ఉన్నందున వీరి చేరిక ఆలస్యమైంది. హస్తినకు చేరుకున్న వెంటనే మైనంపల్లి, వేముల వీరేశంలను ఖర్గే సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సెప్టెంబర్ 22న బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. మల్కాజ్గిరి ప్రజలు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు ఓ వీడియోను రిలీజ్ చేశారు. అయితే కొడుకు మైనంపల్లి రోహిత్కు మెదక్ టికెట్ ఆశించి భంగపడటంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

గత నెల 21న కేసీఆర్ బీఆర్‌ఎస్‌ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన మైనంపల్లికే మరోమారు టికెట్‌ కేటాయించిన సీఎం.. రోహిత్‌కు మాత్రం టికెట్‌ ఇవ్వలేదు. దీంతో తీవ్ర అంసతృప్తికిలోనైన ఆయన బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేశారు. వాస్తవానికి ఈ నెల 26న ఢిల్లీలో సోనియా, రాహుల్‌ గాంధీ సమక్షంలో మైనంపల్లి కాంగ్రెస్‌లో చేరుతారని వార్తలు వచ్చాయి. తాజాగా ఖర్గే సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

Updated : 28 Sept 2023 8:42 PM IST
Tags:    
Next Story
Share it
Top