వైరల్ ఫొటోపై స్పందించిన పైలెట్ రోహిత్ రెడ్డి
X
వికారాబాద్ జిల్లా తాండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫొటోషూట్ వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రభుత్వం కల్పించిన సెక్యూరిటీని ఫొటోషూట్లకు వినియోగించడంపై విపక్ష పార్టీల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు ట్రోల్స్ సైతం చేశారు. తాజాగా ఈ వీడియోపై స్పందించిన రోహిత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
మీడియాతో చిట్‌చాట్ చేసిన పైలెట్ రోహిత్ రెడ్డి తాను ప్రధాని నరేంద్రమోడీలా ఉద్దేశపూర్వకంగా వీడియో తీసుకోలేదని చెప్పారు. క్యాజువల్‌గా నడుచుకుంటూ వస్తుంటే కొందరు స్నేహితులు స్నాప్ చాట్‌లో వీడియో తీశారని చెప్పారు. ఎవరిని ఇబ్బంది పెట్టడం తన ఉద్దేశం కాదన్న రోహిత్ రెడ్డి.. తాను వీడియోల కోసం ప్రభుత్వ సిబ్బందిని వాడుకునే రకంకాదని అన్నారు.
అతి రుద్ర మహాయాగంలో అపశృతి చోటు చేసుకోవడంపైనా రోహిత్ రెడ్డి స్పందించారు. హోమం అయ్యాక పైనుంచి ఒక స్పార్క్ వచ్చి మంటలు అంటుకున్నాయని అన్నారు. ఆ సమయంలో వేద పండితులు యగశాలలోనే ఉన్నారని.. హోమం అంతా పూర్తి అయ్యాక మంటలు రావడం శుభపరిణామం అని రోహిత్ రెడ్డి చెప్పారు.