Home > తెలంగాణ > రఘన్న బంపర్ ఆఫర్.. మహిళలకు అవి ఫ్రీ..

రఘన్న బంపర్ ఆఫర్.. మహిళలకు అవి ఫ్రీ..

రఘన్న బంపర్ ఆఫర్.. మహిళలకు అవి ఫ్రీ..
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ యువతను ఆకర్షించేందుకు రాజకీయ నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తమ పార్టీని గెలిపించాలని హామీలు ఇస్తున్నారు. ఈ క్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆడపడుచులకు రాఖీ కానుక ఇచ్చారు. దుబ్బాక నియోజక వర్గంలోని మహిళలకు ఉచితంగా టూ వీలర్, ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దుబ్బాక క్యాంపు కార్యాలయంలో రాఖీ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ హామీ ప్రకటించారు.

ఈ సంద్భంగా మాట్లాడిన ఆయన సెప్టెంబర్ 10 నుంచి ఉచిత లైసెన్స్ ల పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. రక్షాబంధన్ సందర్భంగా దుబ్బాక నియోజక వర్గంలోని మహిళలకు ఉచితంగా డ్రైవింగ్ నేర్పించి లైసెన్స్ లు అందజేయాలని పిలుపునిచ్చారు. ప్రతీ ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 7893335975 whatsup నెంబర్ కు ద్వారా తమ పేరును నమోదు చేసుకోవాలి. సెప్టెంబర్ 10 నుండి ఉచిత డ్రైవింగ్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది.



Updated : 31 Aug 2023 5:12 PM IST
Tags:    
Next Story
Share it
Top